హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అగ్రి గోల్డ్ బాండ్లు స్వీకరణ

SKLM: సరుబుజ్జిలి మండల వ్యాప్తంగా బుధవారం అగ్రిగోల్డ్ బాండ్లను స్వీకరిస్తున్నట్లు సీఐడీ డీఎస్పీ కాళిదాసు తెలిపారు. శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో బాధితుల నుంచి ఒరిజినల్ బాండ్లు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. మండల బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, షెడ్యూల్ తప్పిన వారికి తర్వాత అవకాశం ఉంటుందన్నారు.