హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్రమశిక్షణ ఉల్లంఘనపై కఠిన చర్యలు: సీపీ

MNCL: బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కొందరు సిబ్బంది విధి సమయంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ డ్యాన్స్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన సీపీ అంబర్ కిషోర్ ఝా.. వారు పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని ఐదుగురు సిబ్బందిని పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. మరో 09 మంది సిబ్బంది పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.