హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శిశు మరణాలను పూర్తిగా అరికట్టాలి'

BPT: ​బాపట్లలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డా. ఎస్. విజయమ్మ ఆధ్వర్యంలో శిశు మరణ సమీక్ష సమావేశం నిర్వహించారు. మరణాల కారణాలను విశ్లేషిస్తూ, తల్లి, శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేయాలని సూచించారు. హైరిస్క్ కేసులను ముందుగానే గుర్తించి, సకాలంలో మెరుగైన వైద్యం అందిస్తూ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.