BDK: ఆళ్లపల్లి మండలం మామకన్ను సబ్ స్టేషన్‌లో అత్యవసర మరమ్మతుల కారణంగా బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు వారు తెలిపారు. కావున వినియోగదారులు అధికారులకు సహకరించాలని వారు కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


