SS: సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తి సాయికుల్వంత్ హాల్‌లో ప్రముఖ వేణువాద్య కళాకారుడు పండిట్ రాకేశ్ చౌరాసియా బృందం సంగీత విభావరి నిర్వహించింది. భీంపలాసి, చారుకేశి రాగాలతో పాటు పహాడీ ధూన్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. మరోవైపు ప్రేమ ప్రవాహిణి రథాలు ఉరవకొండ, అనంతపురం, ధర్మవరం మీదుగా ప్రశాంతి నిలయానికి చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తిలో రాకేశ్ చౌరాసియా వేణునాదం


