MDK: మెదక్ జిల్లాలో చలి తీవ్రత అధికంగా నమోదైంది. జిల్లా కేంద్రంలో అత్యల్పంగా 12.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, చిట్కుల్లో 31.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. జిల్లాలోని ఏ వాతావరణ కేంద్రంలోనూ వర్షపాతం నమోదు కాలేదు. రాత్రి, ఉదయం వేళల్లో చలి గాలుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాను వణికిస్తున్న చలి


