ASR: కొయ్యూరు మండలం ఎం.మాకవరం గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని జెడ్పీ సీఈవో పీ. వాసుదేవరావు ఆకస్మికంగా సందర్శించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి, ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. డిప్యూటీ ఎంపీడీవో టీ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన జెడ్పీ సీఈవో


