హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాదకద్రవ్యాల రహిత సమాజానికి కృషి చేయాలి'

NRPT: మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం అందరం కృషి చేద్దామని కలెక్టర్ ప్రియాంక అన్నారు. భారతీయ రెడ్ క్రాస్ సొసైటీ, నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రూపొందించిన వాల్ పోస్టర్లను మంగళవారం నారాయణపేట కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో విడుదల చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోరాదని అన్నారు.