హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంగన్‌పల్లిలో వ్యక్తి అదృశ్యం

GDWL: కేటిదొడ్డి మండలం గంగన్‌పల్లి గ్రామానికి చెందిన పెద్ద తాయప్ప అలియాస్ బుగ్గారెడ్డి (61) ఈ నెల 2న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. మతిస్తిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గ్రామాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. కుమారుడు మైలారం ఫిర్యాదు మేరకు కేటిదొడ్డి ఎస్సై పి.శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.