హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరుకు మరో గుర్తింపు.. రూ.10 లక్షల ప్రోత్సాహకం

నెల్లూరు: స్వచ్ఛాంధ్ర అవార్డులు-2026లో నెల్లూరు కార్పొరేషన్ సత్తాచాటింది. మూడు సాధారణ అవార్డులతో పాటు వాయు నాణ్యత పరిరక్షణ విభాగంలో ప్రత్యేక అవార్డుకు ఎంపికైంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 10 లక్షల ప్రోత్సాహక నగదు అందినట్లు కమిషనర్ వై.ఓ. నందన్ తెలిపారు. పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ గుర్తింపు సాధ్యమైందన్నారు.