హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా కార్తీకమాస దీపోత్సవాలు

SRCL: వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు మంగళవారం 7వ రోజు రాత్రి వేడుకలను ఆలయ ఈవో రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రతిరోజు రాత్రి సుహాసినుల ఆధ్వర్యంలో భీమేశ్వరాలయ ఆవరణలో సామూహిక దీపోత్సవం నిర్వహిస్తున్నారు. మహిళలు వివిధ ఆకృతులలో దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.