హైదరాబాద్: 28°C
వార్తలు

ఏరోస్పేస్ టూలింగ్ సెంటర్‌ ప్రారంభించిన మంత్రి

TG: రాష్ట్రంలో ఏరోస్పేస్ రంగం అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రంగారెడ్డి జిల్లా తీగాపూర్‌లో జేహెచ్ ఏరోస్పేస్ టూలింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఏరోస్పేస్ రంగంలో అంతర్జాతీయ పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. విమాన ఇంజిన్ల తయారీకి అవసరమైన అత్యాధునిక టూల్స్ ఇక్కడ తయారవుతాయని చెప్పారు.