జగిత్యాలలో తాగునీటి సరఫరాకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనుందని కమిషనర్ సత్య ప్రణవ్ తెలిపారు. ఐడీఓసీ వాటర్ ట్యాంక్ వద్ద వాల్వ్ మార్పిడి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందులో హౌసింగ్ బోర్డు కాలనీ, తులసి నగర్, వాణి నగర్, కలెక్టరేట్ పరిసరాల్లో సరఫరా నిలిచిపోనుందని, ప్రజలు ముందస్తుగా నీరు నిల్వ చేసుకోవాలని, పనులు పూర్తికాగానే పునరుద్ధరిస్తామని తెలిపారు.
తెలంగాణ
తాగునీటికి అంతరాయం..!


