దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యానికి రవాణా రంగమే ప్రధాన కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వాహనాల సంఖ్య పెరగడం వల్ల పర్యావరణంపై తీవ్ర ఒత్తిడి పడుతోందని తెలిపారు. దేశంలోని వాయు కాలుష్యంలో 40 శాతానికి తానే బాధ్యత వహిస్తున్నట్లు అంగీకరించారు. రవాణా రంగ మార్పులకు విధాన నిర్ణేతగా తనకూ బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన బయోఎనర్జీ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వార్తలు
కాలుష్యానికి బాధ్యత నాదే: గడ్కరీ


