హైదరాబాద్: 28°C
వార్తలు

క్వాడ్ సదస్సు.. మోదీ చేసిన పని వైరల్

ఫిలిప్పీన్స్ మనీలా వేదికగా ప్రధాని మోదీ చేసిన ఓ చిన్న పని అందరి దృష్టిని ఆకర్షించింది. క్వాడ్ గ్రూప్ దేశాధినేతల ఫోటో సమయంలో నేలపై పడివున్న భారత జెండా గుర్తు ఉన్న చిన్న కార్డును మోదీ స్వయంగా తీసి తన జేబులో పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే గ్రూప్ ఫోటో సమయంలో వేదికపై నేతలు నిలబడే స్థానాలను సూచించేందుకు జాతీయ జెండా మార్కర్లను ఏర్పాటు చేశారు.