హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలాశయంతో మారిన మా కుటుంబ చరిత్ర: ఎమ్మెల్యే

MBNR: ఒకప్పుడు వేల ఎకరాల భూములు కలిగిన తమ జాగీర్దార్ కుటుంబ చరిత్ర గండిపేట జలాశయం నిర్మాణంతో మారిపోయిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. మంగళవారం నవాబుపేటలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జలాశయం నిర్మాణంలో తమ కుటుంబ ఆస్తులు నీటమునగడంతో సొంత ఊరును వదిలి రంగారెడ్డిగూడకు వలస వచ్చామని వెల్లడించారు.