హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా సురేందర్ గౌడ్!

SRD: జోగిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ కౌన్సిలర్ ఎస్. సురేందర్ గౌడ్ పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. మంత్రి దామోదర్ రాజనర్సింహ తన నివాసంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై డైరెక్టర్ల ఎంపికపై చర్చించారు. పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి నిర్ణయించినట్లు తెలుస్తోంది.