SRD: పరిశ్రమలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అండగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జి. దానయ్య అక్టోబర్ 5న పాశమైలారం ల్యాంప్టఫ్ పరిశ్రమలో గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తితో పరిశ్రమ యాజమాన్యంతో చర్చించిన ఎమ్మెల్యే రూ.29 లక్షల పరిహారం మంజూరు చేయించారు.
తెలంగాణ
కార్మికుడి కుటుంబానికి రూ.29 లక్షల పరిహారం


