హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుంతలమయంగా మల్లేపల్లి రహదారి

NRPT: ఉట్కూర్ మండలం మల్లేపల్లి నుంచి నాగిరెడ్డిపల్లెకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. పలుచోట్ల కంకర తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.