NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను జిల్లా మాధ్యమిక విద్యాధికారి జాదవ్ పరశురామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. సిలబస్ ఎంతవరకు పూర్తయిందో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు బోధనలో నాణ్యత పాటించాలని అధ్యాపకులకు సూచించారు.
తెలంగాణ
విద్యార్థుల హాజరు పెంచాలి: విద్యాధికారి


