హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ ఎండీని కలిసిన ఖమ్మం ఆర్ఎం

KMM: TGSRTC నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన అనిల్ కుమార్ ను మంగళవారం ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎండీకి పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఆర్ఎం వివరించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలందించాలని ఎండీ ఆయనకు సూచించారు.