హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ కార్యకర్త ఇంట ఎంపీ భోజనం

BHNG: బీజేపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారితో ఆత్మీయంగా గడిపే కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు భువనగిరి పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. అనంతరం స్థానికంగా నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు.