హైదరాబాద్: 28°C
తెలంగాణ

గిరిజన సర్పంచ్‌పై దాడికి నిరసన

JN: పాలకుర్తిలో గిరిజన సర్పంచ్ బానోత్ మహేందర్ నాయక్‌పై జరిగిన దాడిని తెలంగాణ గిరిజన సర్పంచుల ఫోరం తీవ్రంగా ఖండించింది. ఈ దాడి ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై జరిగిన దాడిగా ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు భూక్య సంతోష్ నాయక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఆందోళనలు చేపడతామన్నారు.