హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ హామీల అమలుపై శ్వేతపత్రం కోరిన BRS

BDK: యూత్ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ అభ్యర్థి ఎనుగుల రాకేశ్ రెడ్డి ఆరోపించారు. నిరుద్యోగుల, విద్యార్థుల సమస్యలపై 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ ద్వారా కలెక్టర్‌కు అందజేశారు. రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు. హామీలపై శ్వేతపత్రం కోరారు.