హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు రికార్డు ధర లభిస్తోంది: ఎమ్మెల్యే

NZB: జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో పీఏసీఎస్ అర్గుల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ముందుచూపుతో ఎనిమిది రకాల వరి సాగుకు సూచనలు చేయడంతో రైతులకు పండించిన ధాన్యానికి మార్కెట్‌లో రికార్డు ధర లభిస్తోందన్నారు.