హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే కప్ పోస్టర్ ఆవిష్కరణ

KNR: శంకరపట్నం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు అజయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కప్ క్రీడా పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అన్ని గ్రామాల యువతీ యువకులు పోటీల్లో పాల్గొనాలని అజయ్ కోరారు. యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి, పీఏసీఎస్ చైర్మన్ గాజుల మహేష్, గట్టు తిరుపతి పాల్గొన్నారు.