హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ పత్రాల పంపిణీలో ఎమ్మెల్యే రాందాస్

KMM: అర్హులైన ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు. కొణిజర్ల ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం లబ్ధిదారులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. పారదర్శకంగా అర్హులను గుర్తించి ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.