హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు తూంపల్లి విద్యార్థినులు

NZB: సిరికొండ మండలం తూంపల్లి పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థినులు అండర్‌-17 ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన అఖిల, పల్లవి, రూపిక, అఖిల, చికిత, శ్రవంతి, రక్షిత ఈ నెల 20 నుంచి 22 వరకు వరంగల్‌లో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థినులను ఎంఈవో పి. రాములు, హెచ్‌ఎం ఎ. మనోహర్ అభినందించారు.