హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొబైల్ షాప్‌లో భారీ చోరీ

మహబూబాబాద్ బస్టాండ్ సమీపంలో ఉన్న మొబైల్ షాప్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. మంగళవారం షాపులోకి చొరబడి సుమారు 40 మొబైల్ ఫోన్లను అపహరించారు. చోరీకి గురైన ఫోన్ల విలువ సుమారు రూ.25 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి, దొంగలను గుర్తించేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు.