SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో హుండీలను లెక్కించగా రూ.3,69,846 ఆదాయం సమకూరినట్లు ఈవో శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి, ప్రధాన అర్చకులు, అధికారులు, లలితా పారాయణ సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
తెలంగాణ
స్వామివారి హుండీ ఆదాయం రూ.3.69 లక్షలు


