హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సన్నబియ్యం పంపిణీ గడువు పొడిగింపు'

ADB: రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ గడువును ఈ నెల 17 వరకు పొడిగించినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం తెలియజేశారు. ఇప్పటి వరకు 86.15% మంది (1,95,602 మంది) బియ్యం తీసుకోగా, ఇంకా 14% మంది తీసుకోవాల్సి ఉందన్నారు. వినియోగదారులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.