హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు

KKD: అక్వాన్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా, మండల మత్స్యశాఖ అధికారులు కృష్ణారావు, శివరామకృష్ణ సూచించారు. ఉప్పాడ తీర గ్రామాల్లో పర్యటించి తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.