MBNR: తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఉద్యోగులు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు కోసం పోరాడుతున్న ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలపై చర్చిస్తామన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ హామీలపై శ్రీనివాస్ గౌడ్ విమర్శలు


