NDL: బనగానపల్లె (మం) నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం ఆదాయం రూ.32,31,480 నగదు, 34 గ్రాముల బంగారం, 490 గ్రాముల వెండి వచ్చినట్లు ఆలయ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చౌడేశ్వరి దేవి ఆలయంలో హుండీ లెక్కింపు


