హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ల కేంద్రాలను పరిశీలించిన డీఎల్‌డీవో

కోనసీమ: రావులపాలెం మండలంలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు సంబంధించి డీఎల్‌డీవో కొత్తపేట సురేష్ కుమార్ ఈరోజు పొడగట్లపల్లి, దేవరపల్లి క్లస్టర్లను సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణకు చేపట్టిన ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధత, అవసరమైన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.