హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'విద్యార్థినుల అస్వస్థతపై సమగ్ర విచారణ'

ATP: గుమ్మగట్ట కస్తూరిబా బాలికల పాఠశాలలో 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించారు. ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.