SKLM: సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకల కోసం శ్రీకాకుళం రోడ్ నుంచి యలహంక వరకు ప్రత్యేక రైలు (08555) నడవనుంది. ఈ నెల 20న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, 21న మధ్యాహ్నం 3 గంటలకు యలహంక చేరుతుంది. తిరుగు రైలు (08556) 24న సాయంత్రం 5 గంటలకు బయలుదేరి 25న సాయంత్రం 5.15కు శ్రీకాకుళం వస్తుంది. విజయనగరం, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ మీదుగా పుట్టపర్తి చేరుతుంది.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం నుంచి పుట్టపర్తికి రైలు


