హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరి విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన

KMM: నూతనకల్ మండలం గంగదేవిపాడు పీఏసీఎస్‌లో కృషి విజ్ఞాన కేంద్రం, వైరా ఆధ్వర్యంలో వరి విత్తనోత్పత్తిపై క్షేత్ర దినోత్సవం నిర్వహించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ టి. పావని, డాక్టర్ ఫణిశ్రీ నాణ్యమైన విత్తనోత్పత్తి పద్ధతులు, మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ కార్యదర్శి మురళి రైతులు ఉన్నారు.