MHBD: కురవి మండల కేంద్రంలో 851 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రామ చంద్ర నాయక్ నూతన పెన్షన్ పత్రాలు పంపిణీ చేశారు. పెన్షన్లు పేదలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయన్నారు. పదేళ్ల నిరీక్షణ తర్వాత పెన్షన్ అందడం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
కురవిలో 851 మందికి నూతన పెన్షన్ల పంపిణీ


