హైదరాబాద్: 28°C
తెలంగాణ

హిల్‌స్ట్రీట్‌ స్కూల్‌లో కలకలం!

HYD: సికింద్రాబాద్‌లోని హిల్‌స్ట్రీట్‌ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు స్మోకింగ్‌ చేస్తూ పట్టుబడ్డారు. ఈ విషయాన్ని గమనించిన గోపాలపురం హెడ్‌ కానిస్టేబుల్‌ బడుగు శివశంకర్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చిన్న వయసులోనే పొగతాగడం వల్ల కలిగే అనర్థాలను వివరించి, మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.