హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో 24న మహా కార్తీక దీపోత్సవం

నెల్లూరు 56వ డివిజన్ గణేశ్ ఘాట్ వద్ద ఈ నెల 24న మహా కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ ఏర్పాట్లను పరిశీలించారు. సాయంత్రం 5 గంటలకు మహిళల శోభాయాత్రతో కార్యక్రమం ప్రారంభమై, 6 గంటలకు హరిద్వార్ పురోహితులతో గంగా హారతి నిర్వహించనున్నారు.