హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమ సమాజ స్థాపనకు సాహిత్యంతో దోహదం'

ELR: సాహిత్యము సమ సమాజ స్థాపనకు దోహదపడుతుందని విద్యావేత్త చుండూరి ప్రకాష్ అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం భీమడోలు గ్రంథాలయంలో కవి సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థుల్లో సాహిత్య అభివృద్ధిపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మల ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. విద్యార్థులు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలని ఆయన అన్నారు.