హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాలలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలి'

ADB: ఎస్సీ రోస్టర్ విధానంతో మాలలకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు కొప్పుల రమేష్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో సంఘం నాయకులతో సమావేశమై మంగళవారం మాట్లాడారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం, డిసెంబర్ 6న మహాపరి నిర్వాణ దినోత్సవాలను విజయవంతం చేయాలని కార్యక్రమంలో చర్చించినట్లు పేర్కొన్నారు.