హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిట్వేలి సర్పంచ్ అభ్యర్థిగా శివ నాగేశ్వర

అన్నమయ్య: చిట్వేలి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బొంతల శివ నాగేశ్వర నామినేషన్ దాఖలు చేశారు. చిట్వేలి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి చిట్వేలి ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తానని, మురుగునీరు నిలువ లేకుండా డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు.