హైదరాబాద్: 28°C
తెలంగాణ

'20 సార్లు దరఖాస్తు చేసినా ఫలితం శూన్యం'

SDPT: జగదేవ్‌పూర్ మండలంలో నిరుపేదలకు ఇళ్లు కల్పించే ఇందిరమ్మ పథకం ఓ దివ్యాంగుడికి అందని ద్రాక్షగా మారింది. తిమ్మాపూర్‌కు చెందిన గుండ్రు స్వామి ఇద్దరు కుమార్తెలతో గుడిసెలో జీవిస్తున్నాడు. ఇల్లు మంజూరు చేయాలని ఏడాదిగా ప్రజావాణిలో 20 సార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఇల్లు మంజూరు చేయాలని సర్పంచ్ రాజు కోరారు.