హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్ సర్క్యూట్‌తో దగ్ధమైన ఇంటిని పరిశీలించిన మంత్రి

GNTR: తెనాలి నియోజకవర్గం చక్రాయపాలెంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైన ఒతుకోలు లక్ష్మయ్య నివాసాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును, ఆస్తి నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇల్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి ధైర్యం చెబుతూ.. అవసరమైన సహాయం అందిస్తామన్నారు.