హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.4.29 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం

SRD: గుమ్మడిదల పురపాలిక అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అన్నారం, బొంతపల్లి, దోమడుగు, వీరన్నగూడెం, గుమ్మడిదలలో రూ.4.29 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్‌పర్సన్ సంధ్యారెడ్డి, కమిషనర్ దశరథ్, నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.