హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథాగా పోతున్న తాగునీరు

GDWL: అలంపూర్ పట్టణంలోని జోగులాంబ ఆలయ సమీప వీధిలో తాగునీరు వృథాగా పోతోంది. ఈ ఏడాది వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక భూగర్భ జలాలు అడుగంటుతున్న వేళ నీటి పొదుపుపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు నీరు వృథాగా పోవడంతో స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి నీటి వృథాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.