హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు గ్రామాల్లో పర్యటించిన సీఐ నగేశ్ బాబు

KDP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముద్దనూరు సీఐ నగేశ్ బాబు చిన్నకత్తిరపల్లె, అకుతోటపల్లె, ఉప్పలూరు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అర్హులైన అభ్యర్థులు ఎలాంటి భయాలు, ఒత్తిళ్లు, ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు.