ADB: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని BRS పట్టణ అధ్యక్షుడు అజయ్ విమర్శించారు. పట్టణంలోని BRS కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలకు రూ. 2,500, తులం బంగారం, రూ. 4,000 పింఛన్ వంటి హామీలను విస్మరించారన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో BRS మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: అజయ్


